వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు జనసేన మద్దతు

కేంద్ర ప్రభుత్వం రేపు (ఏప్రిల్ 2) వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ తమ పంథా ప్రకటించింది. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ చట్ట సవరణ ముస్లిం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని జనసేన విశ్వసిస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జనసేన పార్టీ లోక్ సభ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశించారు.

Pawan Kalyan
Janasena Party
Wakf Board Amendment Bill
Lok Sabha
Muslim community
India
Central Government
Bill support

More Telugu News